తెలంగాణలో కొత్తగా 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతోంది. సోమవారం కొత్తగా కేవలం 2 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కొత్తగా 2 కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1003కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న 16 మంది బాధితులను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story