ఢిల్లీ మహిళా కమిషన్ కౌన్సిలర్, డ్రైవర్ క్వారంటైన్ కు తరలింపు

ఢిల్లీ మహిళా కమిషన్  కౌన్సిలర్, డ్రైవర్ క్వారంటైన్ కు తరలింపు
X

ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డిసిడబ్ల్యు) తో కలిసి పనిచేసే కౌన్సిలర్ తోపాటు, డ్రైవర్ ను క్వారంటైన్ కు తరలించారు. వీరిద్దరూ కరోనావైరస్ రోగిని కలవడంతోనే నిర్బంధానికి పంపారు. డీసీడబ్ల్యూ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, మహిళా కమిషన్ కౌన్సిలర్, డ్రైవర్ కోవిడ్ -19 కు పాజిటివ్ గా పరీక్షించిన మహిళను రక్షించారు.

దాంతో ఆ మహిళతో ప్రత్యక్ష సంబంధం కారణంగా ఇద్దరిని క్వారంటైన్ కు తరలించినట్టు డీసీడబ్ల్యూ అధికారులు తెలిపారు. కాగా ఢిల్లీలో మొత్తం కరోనావైరస్ కేసులు 3,000 మార్కును దాటాయి, తాజాగా 190 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇదిలావుంటే దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్‌ అన్నారు. గడిచిన ఏడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

Tags

Next Story