మరోసారి ఆసుపత్రిపాలైన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్..

మరోసారి ఆసుపత్రిపాలైన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్..
X

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరోసారి ఆసుపత్రిపాలయ్యారు. ఆయన ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దప్రేగులో ఇన్ఫెక్షన్ కారణంగా ఐసియు (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) లో ఉన్నట్లు ఆయన ప్రతినిధి నుంచి అధికారిక ప్రకటన మంగళవారం వెలువడింది. ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని..

తనకున్న సంకల్ప శక్తి, అతని శ్రేయోభిలాషుల ప్రార్థనలతో త్వరలోనే కోలుకుంటారు అని ఆ ప్రతినిధి చెప్పారు. కాగా ఇర్ఫాన్ ఖాన్ ఇదివరకే న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని గత ఏడాది సెప్టెంబర్‌లో ముంబై చేరుకున్నారు. ఇదిలావుంటే ఈవారమే ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం మరణించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా జైపూర్లో జరిగిన తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేదు ఇర్ఫాన్.

Tags

Next Story