జూన్‌లో జేఈఈ-మెయిన్ పరీక్ష!

దేశ వ్యాప్తంగా ఇంటర్ విద్య పూర్తి చేసుకుని జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు రాయడానికి స్టూడెంట్స్ ఎదురుచూస్తున్నారు. అయితే దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కారణంగా వాయిదా పడ్డ పరీక్షలు, ప్రవేశాలు, విద్యాసంవత్సర క్యాలెండర్ ప్రారంభం తదితర అంశాలపై చర్చించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ-మెయిన్ పరీక్షల్ని జూన్ 20-22 తేదీల మధ్యలో నిర్వహించనున్నారు. అలాగే జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్షని జూలై 12న నిర్వహించే అవకాశం ఉన్నదని ‘జేఈఈ అడ్వాన్స్‌డ్-2020’ ఆర్గనైజింగ్ చైర్మన్ సిద్ధార్థ్ పాండే తెలిపారు. విద్యాసంవత్సరాన్ని సెప్టెంబర్‌లో ప్రారంభించవచ్చని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com