కరోనా కాదంటున్నారు మరిదేంటో కొత్త జబ్బు.. బ్రిటన్ బాలలు..

కరోనా కాదంటున్నారు మరిదేంటో కొత్త జబ్బు.. బ్రిటన్ బాలలు..

కోవిడ్ నుంచి కోలుకోనేలేదు.. పాజిటివ్ కేసులు.. మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. మరో జబ్బు లక్షణాలు బ్రిటన్ చిన్నారులలో కనిపిస్తున్నాయి. కడుపునొప్పి, గుండెలో వాపు వంటి ప్రమాదకర లక్షణాలతో హాస్పిటల్ ఐసీయుల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. మొదట ఈ లక్షణాలను కరోనాకు సంబంధించినవిగాన భావించారు.. కానీ వైరస్ సోకని పిల్లల్లోనూ ఈ లక్షణాలు కనిపిస్తుండడంతో బ్రిటన్ ప్రభుత్వం కలవరపాటుకు గురవుతోంది. దీంతో జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్ఎస్) అప్రమత్తమై హెచ్చరిక జారీ చేసింది. పిల్లల్లో సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే హస్పిటల్‌లో చేర్పించాలని ఆదేశించింది.

బ్రిటన్‌లోని పలు ప్రాంతాల్లో మూడు వారాలుగా చిన్నారులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నట్లు తాము గుర్తించామని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. ప్రాణాంతక టాక్సిక్ షాక్ సిండ్రోమ్ తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. లండన్‌కు చెందిన పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. తాజా అనారోగ్యం సార్స్-కొవ్-2 సంబంధిత ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ లేదా మరొకటి అయి ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఎంతమంది పిల్లల్లో ఈ అనారోగ్యం కనిపించింది. ఈ వ్యాధితో ఎవరైనా మరణించారా అన్న విషయాలను మాత్రం ఎన్‌హెచ్ఎస్ వెల్లడించలేదు.

Tags

Read MoreRead Less
Next Story