ప్రారంభ దశలోనే ప్లాస్మా చికిత్స.. ఇప్పటివరకు ఆమోదించలేదు : ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ప్రారంభ దశలోనే ప్లాస్మా చికిత్స.. ఇప్పటివరకు ఆమోదించలేదు : ఆరోగ్య మంత్రిత్వ శాఖ
X

భారతదేశంలో ఇప్పటివరకు 29,435 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే 6,864 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి లవ్ అగర్వాల్ బులిటెన్ ను విడుదల చేశారు. 24 గంటల్లో భారత్‌లో 1,543 తాజా కేసులు నమోదయ్యాయని... దీంతో దేశంలో ఇప్పుడు మొత్తం సంఖ్య 29,435 గా ఉందని.. 24 గంటల్లో 684 రికవరీలు నమోదయ్యాయని తెలిపారు.

ఇక కరోనా కట్టడికోసం తెరపైకి వచ్చిన ప్లాస్మా థెరపీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లాస్మా థెరపీ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. "క్లినికల్ రీసెర్చ్ మరియు ట్రయల్స్ ద్వారా సరైన ఆమోదం లభిస్తే తప్ప, ప్లాస్మా థెరపీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబడదని ఐసిఎంఆర్ స్పష్టం చేయాలనుకుంటుంది" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక సూరత్ లో IMCT టెక్నాలజీతో కేసులను ట్రాక్ చేస్తోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Tags

Next Story