బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (58) మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మంగళవారం పెద్ద పేగులో ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనను icu లో ఉంచి చికిత్స అందించారు. అయినా లాభం లేకుండా పోయింది తీవ్ర అస్వస్థతకు గురైన ఇర్ఫాన్ ఈరోజు మృతి చెందారు. మూడు దశాబ్దాలుగా సినీ కెరీర్‌లో ఉన్న ఇర్ఫాన్ ఖాన్ 50 కి పైగా భారతీయ చిత్రాలలో నటించారు. అలాగే అంతర్జాతీయ చలనచిత్రాలు అయిన ది నేమ్‌సేక్, ది స్లమ్‌డాగ్ మిలియనీర్, లైఫ్ ఆఫ్ పై మరియు జురాసిక్ వరల్డ్ కూడా కీలక పాత్రలు పోషించారు.

కాగా ఇర్ఫాన్ ఖాన్ ఇదివరకే న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని గత ఏడాది సెప్టెంబర్‌లో ముంబై చేరుకున్నారు. ఇదిలావుంటే రెండు రోజుల కిందటే ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం మరణించారు. అయితే, అనారోగ్యం, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా జైపూర్లో జరిగిన తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేదు ఇర్ఫాన్. ఇప్పుడు ఇర్ఫాన్ కూడా మృతి చెండంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు

Tags

Read MoreRead Less
Next Story