బ్యాంకులకు పంగనామాలు పెట్టిన ఆ బడా బాబులకు భారీ వరాన్ని ఇచ్చిన ఆర్బీఐ

బ్యాంకులకు పంగనామాలు పెట్టిన ఆ బడా బాబులకు భారీ వరాన్ని ఇచ్చిన ఆర్బీఐ
X

లక్షరూపాయలు బ్యాంకు లోన్ కోసం వెళితే సవాలక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. తిరిగి కట్టకపోతే పరువు బాజారుకీడ్చేలా నోటీసులు.. అయిదెకరాల రైతుకు అవసరమైన రుణాన్ని ఇవ్వని బ్యాంకు సంస్థలు.. వేలకోట్లు కార్పొరేట్ ముసుగులో కంత్రీగాళ్లకు ముట్టజెప్పి చేతులు కాల్చుకుంటున్నాయి. బ్యాంకులకు భారీ స్థాయిలో పంగనామాలు పెట్టి విదేశాల్లో జల్సా చేస్తున్న బడాబాబులకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ వ‌రాన్నే ఇచ్చింది. ఏకంగా 68,600 కోట్ల రూపాయ‌ల రుణాల‌ మొండి బకాయిలను ర‌ద్దు చేసింది. స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ఈ విషయం బహిర్గతం అయింది. 68,600 కోట్ల రూపాయ‌లు అంటే చిన్న విషయం కాదు.. దేశంలో పలు రాష్ట్రాల ఇది వార్షిక బ‌డ్జ‌ట్. ఇందులో 50 మందికి చెందిన సంస్థలు ఉన్నాయి.

అందులో ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి వేలకోట్లు కాజేసి విదేశాల్లో తలదాచుకున్న మోహిల్ చోక్సి, 9 వేల కోట్లు మింగేసిన విజయ్ మాల్యా కూడా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే తాను తీసుకున్న రుణాన్ని వడ్డీలేకుండా కడతానని విజయ్ మాల్యా చెప్పినా.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కు కూడా 1,943 కోట్ల రూపాయలను మాఫీ చేసింది. అలాగే మోహిల్ చోక్సికి చెందిన గీతాంజలి జెమ్స్ 5,492 కోట్ల రూపాయలు చేసింది. ఆర్‌ఇఐ ఆగ్రో, రూ .4,314 కోట్లు, విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ రూ .4,076 కోట్లు. బాబా రాందేవ్ అండ్ బాల‌కృష్ణ గ్రూప్ నకు 2212 కోట్ల రూపాయ‌ల రుణాల‌ను మాఫీ చేశారు. ఇంకా పలువురిని ఢీపౌల్టర్లుగా గుర్తించింది ఆర్బీఐ.

Tags

Next Story