రైళ్లు, విమానాలు అప్పుడే రావండి: కిషన్ రెడ్డి

ఎండాకాలం శెలవుల్లో ఎన్ని ప్లాన్స్.. అవన్నీ కరోనా వచ్చి కాకిలా ఎత్తుకుపోయింది.. ఎక్కడికి వెళ్తావ్.. నోర్మూసుకుని ఇంట్లో కూర్చో అని అందర్నీ కట్టడి చేసింది. పోనీ మే 3 తరువాత లాక్‌డౌన్ అయిపోతుంది కదా. అప్పుడైనా వెళ్లొచ్చా అంటే అప్పుడు కూడా ఇంట్లోనే.. ఎక్కడికి వెళ్లడానికైనా రైళ్లు, విమానాలు నడిచే అవకాశం లేదంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రీన్ జోన్‌లో కొంత మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉన్నా దానిపై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు మంత్రి. అయితే మే 3 తరువాత కొంత వెసులు బాటు కలిగించే ప్రయత్నం చేస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు వారిని వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆ దిశగా అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com