ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
X

ఆంధ్రప్రదేశ్ లో మొన్నటిదాకా నివురుగప్పిన నిప్పులా ఉన్న కరోనా.. ఒక్కసారిగా విజృంభిస్తోంది. వరుసగా రోజూ 70 కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 82 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ తాజా కేసులతో, రాష్ట్రంలో మొత్తం 1,259 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. మంగళవారం నాటికి రాష్ట్రంలో 31 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 250 మందికి పైగా కోలుకున్నారు. రాష్ట్రంలో ఇన్‌ఫెక్షన్ రేటు కేవలం 1.6 శాతం మాత్రమేనని, జాతీయ సగటు నాలుగు శాతంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలాగే కేసుల ఉధృతి పెరుగుతుండడంతో ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.

Tags

Next Story