దేశంలో ముప్పై వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో ముప్పై వేలు దాటిన కరోనా కేసులు
X

దేశంలో కరోనావైరస్ ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 31,332 కు చేరుకోగా, మరణాలు 1,000 మార్కును దాటాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, 24 గంటల్లో 73 మరణాలను నమోదు అయ్యాయి, మరణాల సంఖ్య మొత్తం 1,007 కు చేరుకుంది.

ప్రస్తుతం మొత్తం కరోనావైరస్ కేసులలో 22,629 క్రియాశీల కేసులు ఉండగా, 7,695 మంది రోగులకు నయం కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇందులో 111 మంది విదేశీ పౌరులు కూడా ఉన్నారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 9,318 కేసులు ఉన్నాయి.. ఇక్కడ మొత్తం 1,388 మంది డిశ్చార్జ్ కాగా, 400 మంది రోగులు వైరస్ కారణంగా మరణించారు. ఇక 3,744 కేసులతో గుజరాత్ రెండవ స్థానంలో ఉంది. గుజరాత్‌లో ఈ 3,744 కేసుల్లో 434 మంది డిశ్చార్జ్ అయ్యారు.. 181 మంది మరణించారు.

ఢిల్లీలో మొత్తం కోవిడ్ -19 కేసులు 3,314 కాగా, 201 కరోనావైరస్ రోగులు ఈ వ్యాధి నుండి కోలుకున్నారు. మధ్యప్రదేశ్‌లో బుధవారం నాటికి మొత్తం 2,387 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు కోలుకున్న వారు 377 మంది ఉన్నారు. 120 మంది మరణించారు.

తమిళనాడులో మొత్తం 2,364 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇక్కడ 768 మంది కోలుకున్నారు. దీంతో తమిళనాడులో 1,937 యాక్టీవ్ కేసులున్నాయి. ఆంధ్రాలో బుధవారం ఉదయం నాటికి మొత్తం కేసులు 1,332 గా ఉన్నాయి. ఇక మొత్తం కేసులు 1,000 మార్కులను దాటిన తెలంగాణలో మంగళవారం ఆరు కొత్త కేసులు వచ్చాయి. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 1,007 ఉన్నాయి.

Tags

Next Story