కరోనా నుంచి కోలుకున్న మహిళ.. ప్లాస్మాను దానం చేయాలని నిర్ణయం

కరోనా నుంచి కోలుకున్న మహిళ.. ప్లాస్మాను దానం చేయాలని నిర్ణయం
X

మధ్యప్రదేశ్ లో కరోనా మహమ్మారి నుండి కోలుకున్న ఓ మహిళ ప్లాస్మాను దానం చేయాలని నిర్ణయించుకుంది. ప్లాస్మా దానం చేయడానికి అనుమతి రావడంతో ఆమె భోపాల్ బయలుదేరింది. కలెక్టర్ భారత్ యాదవ్ చెప్పిన వివరాల ప్రకారం, మార్చి 20 న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నలుగురు కరోనా భారిన పడ్డారు, అయితే అందులో ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఉన్నారు. మహిళ తోపాటు ఆమె భర్త , కూతురు ఉన్నారు. ఈ క్రమంలో చికిత్స పొందిన అనంతరం వారు కోలుకున్నారు. మహిళ మరియు ఆమె భర్త ఏప్రిల్ 5న ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయితే..

ఆ తరువాత, వారి కుమార్తె కూడా కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తరువాత 14 రోజుల పాటు ఇంటి నిర్బంధంలో కూడా ఉన్నారు. అయితే కరోనాతో యుద్ధంలో గెలిచిన తరువాత, వైరస్ తో బాధపడుతున్న ఇతర రోగులకు సహాయం చేయడానికి

ఆ మహిళ ముందుకు వచ్చింది. భోపాల్‌లోని బి-పాజిటివ్ బ్లడ్ గ్రూపునకు చెందిన సదరు మహిళ బంధువుల ద్వారా వైద్యుడి సహకారంతో ప్లాస్మాను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అనుమతి రావడంతో ఆమె తన కుమార్తెతో సహా భోపాల్ వెళ్లారు.

Tags

Next Story