సీఆర్పీఎఫ్ జవాన్లలో ఆందోళన.. 47 మందికి పాజిటివ్

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ప్రజలు కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోకూడదని విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు వైరస్ బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. తాజా లెక్కల ప్రకారం 12 మంది భద్రతా సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 47కు చేరుకుంది. వీరిలో అసోంకు చెందిన ఒక జవాన్ సోమవారం దిల్లీలోని సప్దార్‌గంజ్ ఆస్పత్రిలో మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ బెటాలియన్‌లో ఉన్న వెయ్యి మంది జవాన్లను క్వారంటైన్‌కు తరలించి కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు. తొలుత సీఆర్పీఎఫ్ యూనిట్‌లో విధులు నిర్వర్తించే పారామెడికల్ జవానుకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం మరికొంత మందికి పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం 47 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కాగా, దిల్లీలో ఇప్పటివరకు 3314 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 1078 మంది కోలుకున్నారు, 54 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com