కరోనా కాటుకు బలైన సిఆర్‌పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్

కరోనా కాటుకు బలైన సిఆర్‌పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్
X

కరోనా కాటుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్)సిబ్బంది ఒకరు బలయ్యారు. మహమ్మారి భారిన పడి 55 ఏళ్ల సబ్ ఇన్స్పెక్టర్ మంగళవారం మరణించారు. దీంతో సిఆర్‌పిఎఫ్‌లో కరోనా ద్వారా మరణించిన మొదటి కేసు ఇది. మృతుడు మయూర్ విహార్ 31వ బెటాలియన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్.

ఆయనకు ఐదు రోజుల కిందట కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చింది. అనంతరం ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు డయాబెటిస్ , రక్తపోటు కూడా ఉంది. మరణించిన సబ్ ఇన్స్పెక్టర్ ను సిఆర్పిఎఫ్ లోని మయూర్ విహార్ క్యాంప్ లో ఉంచారు. మృతుడికి ఒక నర్సింగ్ కార్మికుడితో సంప్రదించిన తరువాత కరోనా సోకినట్లు వర్గాలు తెలిపాయి.

Tags

Next Story