కరోనా ఎఫెక్ట్.. ఆర్‌బీఐ కొత్త కేంద్ర కార్యాలయం మూసివేత

కరోనా ఎఫెక్ట్.. ఆర్‌బీఐ కొత్త కేంద్ర కార్యాలయం మూసివేత
X

కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త కేంద్ర కార్యాలయ భవనాన్ని( NCOB) మూసివేస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. అత్యవసర సమయంలో ఎవరైనా NCOB నుంచి పనిచేయవలసి వస్తే, ఆ సిబ్బంది తప్పని సరిగా డిప్యూటీ గవర్నర్‌ అనుమతి తీసుకోవాలి. ఈ సమయంలో NCOB సిబ్బంది మొత్తాన్ని ఇంటి నుంచే పనిచేయమని సూచించామని ఆర్‌బీఐ వర్గాలు తెలిపాయి.

"ముంబైలోని కోవిడ్‌-19 మహమ్మారిని అదుపుచేసేందుకు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొత్త కేంద్ర కార్యాలయ భవనాన్ని మూసివేస్తున్నాం. ఆర్‌బీఐలోని సిబ్బందిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని, భద్రతా సిబ్బందితో పాటు ముఖ్యమైన బృందాన్ని మాత్రమే అనుమతిస్తాం" అని ఆర్‌బీఐ ఇంటర్నల్‌ కమ్యూనికేషన్స్‌లో ఉద్యోగులకు తెలిపింది. ఈ వార్తను ఆర్‌బీఐ ముఖ్య అధికార ప్రతినిధి దృవీకరించారు.

ఒక ఆర్‌బీఐ ఉద్యోగితో పాటు ఆయన మామకు కోవిడ్‌-19 పాజిటివ్‌గా ఇటీవల తేలింది. ఆర్‌బీఐ బైకుల్లా కాలనీలో వీళ్ళు నివసిస్తున్నారు. దీంతో ఈ కాలనీకి అధికారులు సీలు వేశారు అని ఒక రిజర్వ్‌బ్యాంక్‌ అధికారి తెలిపారు.

కరోనా వ్యాధిపై కేంద్రం అప్రమత్తమైన కొద్ది రోజులకే ఆర్‌బీఐలోని సుమారు 150 మంది అధికారులను తెలియని ప్రదేశానికి మార్చింది. దీంతో ఆర్‌బీఐ యొక్క ప్రధాన విధులు యథాతథంగా జరుగుతాయని, కోవిడ్‌-19 ఎలాంటి ప్రభావితం చూపదని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. కోవిడ్‌-19 ముప్పు ముగిసేవరకు ఈ అధికారులంతా దిగ్భంధనంలో ఉంటారని, ఆర్‌బీఐకు సంబంధించిన క్లిష్టమైన విధులన్నింటినీ వీరు కొనసాగిస్తారని ఆర్‌బీఐ వెల్లడించింది.

Tags

Next Story