కరోనా కొత్త రూల్.. మాస్క్ పెట్టుకోపోతే రూ.5000 జరిమానా

కరోనా కొత్త రూల్.. మాస్క్ పెట్టుకోపోతే రూ.5000 జరిమానా
X

ఒకప్పుడు హెల్మెట్ పెట్టుకోండ్రా నాయనా లేకపోతే ఛస్తారు అని వెంటపడే వారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పుడు కోవిడ్ పుణ్యమా అని హెల్మెట్ కంటే మాస్క్ మరీ ముఖ్యం అంటున్నారు. పెట్టుకోలేదంటే రూ.5000 ఫైన్ వసూలు చేస్తామని రూల్స్ పాస్ చేస్తున్నారు కేరళలోని వయనాద్ పోలీసులు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా మాస్క్ లేకుండా కనిపించారో ఖబడ్దార్ అంటూ.. సెక్షన్ 118ఈ ప్రకారం కేసు బుక్ చేసి 5వేలు జరిమానా వసూలు చేస్తామని తెలిపారు. జరిమానా ఒక్కటే కాదంట.. మాస్క్ లేకుండా పట్టుబడిన వ్యక్తులు కోర్టులో కేసు విచారణ జరగాలని కోరుకుంటే చట్ట ప్రకారం దోషిగా నిర్దారణ అయితే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, లేదంటే రూ.10,000 వరకు జరిమానా.. ఒక్కోసారి రెండు శిక్షలు విధించే అవకాశం ఉంటుందంటున్నారు.

Next Story