ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు రిషి కపూర్

ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు రిషి కపూర్

ప్రముఖ నటుడు రిషి కపూర్‌ను బుధవారం ఉదయం ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆయన సోదరుడు రణధీర్ కపూర్ ధృవీకరించారు. "రిషి కపూర్‌ కు ఆరోగ్యం సరిగా లేనందువల్ల ఆసుపత్రిలో చేరారు. ఆయన భార్య నీతు కపూర్ ఆయనకు సహాయంగా ఆసుపత్రిలో ఉన్నారు " అని రిషి కపూర్ పిఆర్ బృందం బుధవారం ఆలస్యంగా పేర్కొంది. కాగా మీడియా నివేదికల ప్రకారం, రిషి కపూర్ కుమారుడు, నటుడు రణబీర్ కపూర్ కూడా సహాయంగా ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ సీనియర్ నటుడు.. 2018 లో రిషి కపూర్‌ కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.. దాంతో క్యాన్సర్ చికిత్స తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో న్యూయార్క్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story