నేను మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదని చైనా కోరుకుంటోంది : డోనాల్డ్ ట్రంప్

నేను మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదని చైనా కోరుకుంటోంది : డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను చెప్పారు. తాను ‌నవంబర్ లో తిరిగి దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని చైనా కోరుకోవడం లేదని అన్నారు. తనను ఆపడానికి చైనా ఏదైనా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కరోనావైరస్ విషయంలో చైనా వ్యవహరిస్తున్న విధానమే ఇందుకు నిదర్శనం అన్నారు. ఈ సంక్షోభం గురించి చైనా త్వరలో ప్రపంచానికి తెలియజేయాలి అని సూచించారు.

చైనాకు సుంకాలు విధించే ప్రశ్నపై సమాధానం చెబుతూ.. ఈ విషయంలో చేయగలిగేవి చాలా ఉన్నాయని.. ప్రస్తుతం పరిణామాలు అన్ని గమనిస్తున్నామని.. భవిశ్యత్ లో ఏమి జరుగుతుందో చూడాలి అని అన్నారు. అంతేకాదు నవంబర్ ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ విజయం సాధించాలని చైనా కోరుకుంటుందని ట్రంప్ అన్నారు. బిడెన్ గెలుస్తారనే గణాంకాలను నేను అనుమానిస్తున్నానని ఇంటర్వ్యూలో చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story