కరోనా వేళ 'కేర్'.. ఫేస్‌బుక్ కొత్త ఎమోజీ..

కరోనా వేళ కేర్.. ఫేస్‌బుక్ కొత్త ఎమోజీ..
X

వంద భావాలు ఒక్క చూపులో పలికించినట్టు.. ఎమోజీల్లో ఎన్నో అర్థాలు. ఇప్పటి వరకు ఉన్న ఆరు ఎమోజీలను మా బాగా వాడేస్తున్నారు ఫేస్‌బుక్ ప్రియులు. మరిప్పుడు వాటి పక్కన మరో కొత్త ఎమోజీ వచ్చి కూర్చుంది. కరోనా కష్ట కాలంలో లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో కూర్చున్నారు అందరూ. భావాల్ని పంచుకోవడానికి, బంధువులను పలకరించడానికి ఫేస్‌బుక్‌ని వేదిక చేసుకుంటున్నారు మరికొందరు. ఇప్పుడున్న థమ్స్‌అప్, హార్ట్, లాఫింగ్, షాక్, శాడ్‌నెస్, యాంగర్ ఎమోజీలతో పాటు కేర్ అని ఓ కొత్త ఎమోజీని తీసుకొచ్చింది ఫేస్‌బుక్.

ఈ విపత్కర పరిస్థితుల్లో మన వారిని జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి కేర్ ఎమోజీని ఉపయోగిస్తారు. నవ్వుతున్న ఒక ఎమోజీ హార్ట్ సింబల్‌ని హత్తుకున్నట్లుగా ఈ కేర్ ఎమోజీని రూపొందించారు. దీంతో పాటు మెసెంజర్‌లో కూడా పర్పుల్ కలర్‌లో ఉండే పల్స్ హార్ట్ ఎమోజీని కొత్తగా తీసుకువచ్చారు. బీటా టెస్టర్ ప్రోగ్రామ్ ఎనేబుల్ చేసుకున్న వారికి ఈ రోజు నుంచి ఈ ఎమోజీ కనిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ లేకపోతే ఫేస్‌బుక్ అప్‌డేట్ వెర్షన్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Tags

Next Story