రాజస్థాన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం బస్సులు పంపిన మహారాష్ట్ర ప్రభుత్వం

రాజస్థాన్ లో చిక్కుకున్న విద్యార్థుల కోసం బస్సులు పంపిన మహారాష్ట్ర ప్రభుత్వం
X

రాజస్థాన్ లో చిక్కుకున్న తమ విద్యార్థులను వెనక్కు తీసుకొని వచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 70 బస్సులను పంపించింది. బుధవారం ఉదయం 10. నిమిషాలకు బస్సులు బయలుదేరాయని ప్రభుత్వం తెలిపింది. బుధవారం రాత్రికి రాజస్థాన్ చేరుకుంటాయని అన్నారు. ప్రతి బస్సులో 20 మందికి మాత్రమే అనుమతిస్తామని.. ఆహారం కోసం మా లేదా 3 చోట్ల బస్సులు ఆగుతాయని అన్నారు. ఒక పక్క ప్రయాణానికి 12 గంటలు సమయం పడుతుందని.. కనుక.. ఒక్కో బసుకి ఇద్దరు డ్రైవర్స్ ను పంపిస్తున్నామని తెలిపారు. బ్రేక్‌డౌన్లు ఎదురైతే ప్రయాణానికి ఆటంకం కలుగకుండా ఉండేందుకు బస్సుల వెంటే ఒక వ్యాన్ కూడా పంపామని అధికారులు తెలిపారు. కాగా.. ఇప్పటికే రాజస్థాన్ కోటాలో చిక్కుకున్న విద్యార్థులను పలు రాష్ట్రాలను స్వస్థలాలకు తీసుకువెళ్లాయి.

Tags

Next Story