అంతర్జాతీయం

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని సహచరి

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బ్రిటన్ ప్రధాని సహచరి
X

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌(55) ఐదోసారి తండ్రయ్యారు. బోరిస్‌ కు కాబోయే భార్య క్యారీ సైమండ్స్‌(32) బుధవారం లండన్‌ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని బోరిస్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని.. మరోసారి తండ్రి కావడంపట్ల బోరిస్‌ చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.. కాగా బోరిస్‌ జాన్సన్‌కు తన మాజీ భార్య మెరీనా వీలర్‌తో ఇదివరకే నలుగురు సంతానం ఉన్నారు. కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరిద్దరూ సహజీవం చేస్తున్నారు. గతేడాది చివర్లో వారి నిశ్చితార్ధం కూడా జరిగింది.

అయితే వివాహం సమయానికి కరోనా విజృంభించడం, దీంతో వారి వివాహం వాయిదా పడటం జరిగిపోయాయి. మరోవైపు బోరిస్‌ జాన్సన్ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే తమ అభినందనలు తెలిపారు. ఇదిలావుంటే బోరిస్‌ జాన్సన్ కోవిడ్ నుండి కోలుకొని ఈ సోమావరమే తిరిగి విధుల్లో చేరారు.

Next Story

RELATED STORIES