ఫోన్ ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడుతూ..

ఫోన్ ఛార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడుతూ..
X

ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడొద్దని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోరు. అలా చేసి ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు ఎన్నో చూస్తుంటాం. అయినా అదే పని చేస్తుంటారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఆర్తి.. విదేశాల్లో ఉన్న తన తండ్రితో వీడియో కాల్ మాట్లాడుతోంది. ఇంతలో చేతిలో ఉన్న ఫోన్ పెద్ద శబ్దంతో పేలింది. ఫోన్ ముక్కలు ఆర్తి కళ్లలో గుచ్చుకున్నాయి. కళ్లు తెరవడానికి రావట్లేదు. దీంతో కుటుంబసభ్యలు వెంటనే ఆమెను తీసుకుని నీడా మంగళం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కుటుంబసభ్యులు వివరించారు.

Tags

Next Story