వృద్దులు, వికలాంగుల సహాయార్ధం టోల్‌ఫ్రీ నెంబర్‌

వృద్దులు, వికలాంగుల సహాయార్ధం టోల్‌ఫ్రీ నెంబర్‌
X

తెలంగాణలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో వృద్దులు, వికలాంగులు ఎక్కువ సమస్యలుఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే వృద్దులు, వికలాంగుల సహాయార్ధం హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేశారు.

వికలాంగులకు సాయం కోసం 1800-572-8980 టోల్‌ఫ్రీ నెంబర్‌ను, వృద్దుల కోసం ప్రత్యేకంగా 1467 టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటుచేసినట్టు వికలాంగులు, వృద్దుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ బి.శైలజ తెలిపారు. ఈ నెంబర్లు ఉదయం 8గంటల నుంచి రాత్రి 7గంటల వరకు పనిచేస్తాయని ఆమె పేర్కోన్నారు.

Tags

Next Story