వంట గ్యాస్ ధర భారీగా..

వంట గ్యాస్ ధర భారీగా..
X

సబ్సిడీయేతర గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా తగ్గాయి. 14.2 కేజీల సిలెండర్‌పై రూ.162.50 తగ్గించారు. గత మూడు నెలల్లో గ్యాస్ సిలెండర్ రేట్లు తగ్గించడం ఇది మూడోసారి. గృహావసరాల కోసం తీసుకునే గ్యాస్ సిలెండర్‌పై సబ్సిడీ వదులుకున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే వారి కోటా ఏడాదికి 12 సిలెండర్లు దాటితేనే వర్తిస్తుంది. కరోనా నేపథ్యలో ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో గ్యాస్ సిలెండర్ ధరలు కూడా తగ్గుతున్నాయి. తగ్గిన రేట్ల ప్రకారం ఢిల్లీలో సిలెండర్ ధర రూ.581.50, ముంబైలో రూ.579. వాణిజ్య అవసరాల కోసం వాడే 19 కేజీల సిలెండర్ ధర కూడా 1,285 ఉన్నది ఇప్పుడు రూ.1029.50కు వస్తుంది.

Tags

Next Story