కరోనా ఎఫెక్ట్.. యువ నటుడి కాలు తొలగించిన డాక్టర్లు

అమెరికాలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. కరోనా దెబ్బకు సామాన్యులు, సంపన్నులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అంతా బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఈ మహమ్మారి కారణంగా హాలీవుడ్ విలవిల్లాడుతోంది. పలువురు సెలబ్రిటీలు దీని బారిన పడుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే హాలీవుడ్ నటులు, సింగర్స్ మృత్యువాత పడ్డారు. తాజాగా హాలీవుడ్ నటుడు కరోనా వలన కాలునే కోల్పోవలసి వచ్చింది.
అమెరికాకు చెందిన 41 ఏళ్ల నిక్ కార్డెరోకి కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో లాస్ ఏంజిల్స్‌లోని ఓ హాస్పిటల్ లో మూడు వారాల పాటు అతనికి ఐసీయూలో చికిత్స అందించారు. అయితే కరోనా కారణంగా అతను తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురయ్యాడు. దీంతో అతని కుడి కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి, ముక్కలుగా విడిపోయింది. ఇది ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాలకే ముప్పు సంభవించే అవకాశం ఉంది. దీంతో, తప్పనిసరి పరిస్థితుల్లో అతని కాలును డాక్టర్లు తొలగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com