పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌కు కరోనా

పాకిస్తాన్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాక్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అక్కడ 16,353 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖురేషీ కరోనా వైరస్‌ బారిన పడ్డారు. గురువారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖురేషీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు. స్పీకర్‌కు దగ్గరగా మెలిగిన వారిని కూడా గుర్తించి క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు.

Tags

Next Story