మరోసారి పాక్ వక్రబుద్ధి.. నియంత్రణ రేఖ సమీపంలో కాల్పులు

నియంత్రణ రేఖకు సమీపంలో పాకిస్తాన్ నిరంతరం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తోంది. పూంచ్‌లో గురువారం ఇఫ్తార్ సందర్భంగా పాకిస్తాన్ కాల్పులు జరిపింది. దీంతో ఇంటి బయట ఉన్న 16 ఏళ్ల బాలుడుకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. దీనిపై పూంచీ డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. మంకోట్ తహసీల్ ప్రాంతంలో రషీద్ అనే వ్యక్తి ఇఫ్తార్ విందు కోసం సన్నాహాలు చేస్తున్నారు.
అయితే 12 వ చదువుతున్న కుర్రాడు గల్ఫరాజ్ ఇంటి బయట నిలబడ్డాడు. అదే సమయంలో, పాకిస్తాన్ నుండి కొందరు సైనికులు షెల్లింగ్ చేయడంతో.. స్ప్లింటర్ తగిలి గల్ఫరాజ్ అక్కడిక్కడే కుప్పకూలాడని చెప్పారు. కాగా రాత్రి 7 గంటలకు పాకిస్తాన్ నుంచి కాల్పులు ప్రారంభమైనట్లు జమ్మూలో ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర ఆనంద్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com