ఆ బిల్డింగ్‌లో 44 మందికి పాజిటివ్.. ఢిల్లీ వాసుల్లో ఆందోళన

ఆ బిల్డింగ్‌లో 44 మందికి పాజిటివ్.. ఢిల్లీ వాసుల్లో ఆందోళన
X

కరోనా మరణాల రేటు తగ్గుతోందనుకునే లోపే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా ఆగ్నేయ ఢిల్లీలోని కపాషేరా ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో నివసిస్తున్న 44 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఏప్రిల్ 18న ఆ భవనంలో నివసిస్తున్న ఓ వ్యక్తి నుంచి వారందరికీ కరోనా సంక్రమించినట్లు తెలుస్తోంది. దీంతో ఈప్రాంతానికి వచ్చే పాలవాడు, కూరగాయలు అమ్మే వాళ్లని అందర్నీ పరీక్షిస్తున్నారు. మొత్తం 350 మంది రిపోర్టులు పంపిస్తే 44 మందికి పాజిటివి అని వచ్చింది. వీరి ద్వారా మరెవరికైనా వచ్చిందా అన్న కోణంలో పరిశోధనలు సాగుతున్నాయి. ఈ ఘటనతో జిల్లా యంత్రాంగం భవనాన్ని సీల్ చేసింది. మరో 175 మంది శాంపిల్స్ సేకరించి టెస్టుకు పంపింది. మరి కొంత మంది రిపోర్ట్స్ రావల్సి ఉంది.

Tags

Next Story