68 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్

68 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్
X

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ ప్రాణాంతకర వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరిపైనా తన ప్రతాపం చూపుతోంది. క‌రోనా వైరస్ బారిన‌ప‌డిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈస్ట్ ఢిల్లీలోని ఓ సీఆర్‌పీఎఫ్‌ బెటాలియ‌న్‌కు చెందిన‌ జ‌వాన్లు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా మ‌రో 68 మంది జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా బారిన‌ప‌డ్డ సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య 127కు చేరింది.

Tags

Next Story