ఏడుగురు కార్మికులకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్ర సర్కార్ లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. అయితే ఈ లాక్ డౌన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా వలసకార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకున్నారు. అయితే మహారాష్ట్రలో చిక్కుకున్న కార్మికులు ఝాన్సీ పట్టణం మీదుగా ప్రభుత్వ బస్సుల్లో యూపీలోని బస్తీ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి అధికారులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో కార్మికులందరినీ ఆస్పత్రికి తరలిరంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కార్మికులతో సన్నిహితంగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నామని పేర్కోన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com