తబ్లీగ్ జమాత్ సభ్యులు హీరోలని ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారికి షోకాజ్ నోటీసులు

తబ్లీగ్ జమాత్ సభ్యులు హీరోలని ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారికి షోకాజ్ నోటీసులు
X

తబ్లీగీ జమాతే సభ్యులు హీరోలని.. వారి గొప్పతనాన్ని మీడియాలో చూపించటం లేదని ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీచేసింది. కర్నాటకకు చెందిన మహ్మద్ మోహసీన్ అనే ఐఏఎస్ అధికారి తబ్లీగీ జమాతే సభ్యుల గురించి ట్వీట్ చేశారు. ‌కరోనా నుంచి కోలుకున్న తబ్లీగీ సభ్యులు.. ప్లాస్మాను డొనేట్ చేసి, కరోనాపై పోరాటంలో భాగం అవుతున్నారని అన్నారు. వారు నిజమైన హీరలని.. కరోనాకు వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాన్ని ఎవరూ గుర్తించడం లేదని అన్నారు.

ఇప్పటి వరకూ దాదాపు 300 మంది తబ్లీగీ సభ్యులు ప్లాస్మాను డొనేట్ చేసి.. దేశభక్తిని చాటుకున్నారని అన్నారు. ఈ హీరోలు చూపిస్తున్న మానవత్వాన్ని మీడియాలో చూపించడం లేదని ఆయన ట్వీట్ చేశారు. వారు అంట చేస్తున్నా.. వారికి ఇంత చేస్తున్నా.. వారికి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మోహసీన్ అన్నారు. దీంతో ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మోహసీన్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం వెనుకబడిన తరగతుల శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన గతంలోనూ వార్తలెక్కారు.

Tags

Next Story