ఆంధ్రప్రదేశ్

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు నియామకం

ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు నియామకం
X

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. న్యాయవాదుల కోటా నుంచి ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. బొప్పూడి కృష్ణమోహన్‌, కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారి ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. కొత్తగా నియమితులైన వారితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది. తాజాగా నియమితులైన వారితో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె.మహేశ్వరి శనివారం ప్రమాణం చేయించనున్నారు.

Next Story

RELATED STORIES