కోవిడ్ రోగులకు అమెరికా ఔషధం..

కోవిడ్ రోగులకు అమెరికా ఔషధం..

ప్రస్తుతం కోవిడ్ బాధితులకు మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చి ఉపశమనం కలిగిస్తున్నారు. కోవిడ్ బాధిత దేశాలకు ఈ మాత్రలను భారత్ ఉచితంగా సరఫరా చేసి తన ఉదారతను చాటుకుంది. ఇదిలా ఉండగా కరోనాని కట్టడి చేసే నిమిత్తం రోగుల ప్రాణాలు కాపాడేందుకు యాంటీ వైరస్ డ్రగ్ రెమ్‌డెసివర్ వాడొచ్చంటూ అమెరికా అధికారికంగా ప్రకటించింది. ఈ మందును కొంత మంది కరోనా రోగులపై ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

దాంతో ఇక్కడి ఔషధ నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఈ డ్రగ్‌ అత్యవసర వినియోగ అనుమతికి అంగీకరించింది. ఇక ఈ ఔషధాన్ని అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెన్ తయారు చేస్తోంది. అయితే కరోనా బాధితుల ఆరోగ్యం మరీ క్షీణిస్తుందని అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఔషధాన్ని ఇవ్వాలని ఎఫ్‌డీఏ సూచించింది. కొవిడ్ చికిత్సలో దీన్ని ఓ ముందడుగుగా సీఈఓ స్టీఫన్ హాన్ అభివర్ణించారు. ఈ ఔషధం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని తేలినప్పటికీ.. మరిన్ని ప్రయోగాలు చేయవలసిన అవసరం ఉందని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story