వ్యవసాయ ఉత్పత్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: వెంకయ్య నాయుడు

వ్యవసాయ ఉత్పత్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: వెంకయ్య నాయుడు
X

వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో మార్కెట్లకు చేర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. లాక్‌డౌన్ సమయంలో రైతులు సమస్యలపై దృష్టి పెడుతూనే.. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎదురవుతున్న ఇబ్బందులని పరిష్కరించాలని అన్నారు.

ముఖ్యంగా ఉద్యానవన రైతులు వారి ఉత్పత్తులుకు రవాణా సౌకర్యాలు లేక... గిట్టుబాటు ధర లభించడం లేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రైల్వే మంత్రి పీయూశ్ గోయల్‌ తో మాట్లాడానని.. ఈ విషయంలో ఆ ఇద్దరు మంత్రులను వెంకయ్య కోరారు.

అయితే ఈ విషయంలో వస్తువులను, పార్శిల్ సేవలను రైల్వే శాఖ పున: ప్రారంభిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

Tags

Next Story