దక్షిణ కొరియాలో కొత్తగా 13 పాజిటివ్ కేసులు

దక్షిణ కొరియాలో పోయిందనుకున్న కరోనావైరస్ మళ్ళీ వ్యాప్తి చెందుతోంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అక్కడ కొత్తగా 13 కరోనావైరస్ కేసులను నివేదించారు, అయితే వాటిలో 10 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివలన సంభవించాయి. వాస్తవానికి దక్షిణకొరియా రెండు వారాలకు పైగా 15 కంటే తక్కువ కేసులను మాత్రమే నివేదించింది, ఇప్పుడు ఏకంగా 13 కేసులు రావడం ఆ దేశ ప్రజలకు ఆందోళన కలిగించే అంశంగా ఉంది.

ఇదిలావుంటే ఈ వారంలో సామాజిక దూర నియమాలను సడలించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం దక్షిణకొరియాలో మొత్తం పాజిటివ్ కేసులు 10,793 గా ఉంటే.. ఇందులో రికార్డు స్థాయిలో 9,183 మంది కోలుకోగా కేవలం 250 మంది మాత్రమే మరణించారు. ఇక్కడ ర్యాపిడ్ టెస్ట్ కిట్ ల ఆధారంగా వేగంగా పరీక్షలు జరిపి కరోనాను సాధ్యమైనంతగా కంట్రోల్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story