జర్నలిస్టులకు పది లక్షల బీమా..

జర్నలిస్టులకు పది లక్షల బీమా..
X

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న జర్నలిస్టులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు పది లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్థంభంగా నిలిచే మీడియా స్వతంత్రంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సరైన వార్తా సమాచారాన్ని అందించడానికి ప్రాణాలకు తెగించి కృషి చేస్తున్నారని, వారి కృషి అభినందనీయమని ఆమె అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. భావ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కరోనాపై ముందుండి పోరాడుతున్న వారితో పాటు జర్నలిస్టులకూ బీమా సౌకర్యం వర్తింప చేస్తామని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags

Next Story