ప్రార్థనలు చేసుకోండి.. కానీ పాటలు పాడకండి

దాదాపు నెలరోజుల నుంచి లాక్డౌన్ కొనసాగుతోంది జర్మనీలో. కొన్ని సడలింపులు చేయడంతో సెలూన్లు, రిపేర్ సెంటర్లు తెరుచుకున్నాయి. చిన్న చిన్న దుకాణాలకు అనుమతులు లభించాయి. అయితే మతపరమైన మందిరాలకు మాత్రం ఎందుకు అనుమతి ఇవ్వరు అని మత పెద్దల నుండి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం స్వీకరించింది. ఈ మేరకు వారితో మాట్లాడి ఒక ఒప్పందానికి వచ్చింది. బెర్లిన్‌లోని ఒక కాథలిక్ సమాజం సామూహిక వేడుకలను కొనసాగించాలని పట్టుబట్టడంతో.. చర్చిలకు వెళ్లడానికి అనుమతిస్తూనే సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని. కానీ ప్రార్థనలు చేసేటప్పుడు పాటలు పాడరాదని విజ్ఞప్తి చేసింది.
ఇలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని నచ్చచెప్పింది. ఓ గాయక బృందంలోని 78 గాయకులలో 59 మంది కరోనా వైరస్ బారిన పడ్డ విషయాన్ని సాక్ష్యంగా చూపింది. సాధారణంగా ఊపిరి పీల్చుకునేటప్పటికంటే పాడుతున్నప్పుడు ఎక్కువగా ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుందని దాంతో వైరస్ కణాలు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుందని వైరాలజిస్టులు చెబుతుంటారు. 65 ఏళ్లు పైబడిన వారు తమ రక్షణ కోసం దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఆరాధకుడు కనీసం 10 చదరపు మీటర్ల దూరం పాటించాలని అప్పుడే చర్చిలోపలికి అనుమతులు లభిస్తాయని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com