రోగం తెచ్చుకోవడం కంటే దాచడం మహా నేరం: యూపీ సీఎం

రోగం తెచ్చుకోవడం కంటే దాచడం మహా నేరం: యూపీ సీఎం
X

తెలిసో తెలియకో వెళ్లారు. చేసింది తప్పో రైటో అవన్నీ పక్కన పెడితే.. కనీసం వెళ్లి వచ్చిన వాళ్లైనా ఎవరికి వారు స్వతంత్రంగా ముందుకు వస్తే ఇంత ముప్పు వాటిల్లేది కాదు కదా అని మర్కజ్‌కి వెళ్లి వచ్చిన వారిపై మండి పడుతున్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. శనివారం జరిగిన ఈ ఎజెండా ఆజ్‌తక్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తబ్లిగీ జమాత్ చేసిన పనిని ఖండిస్తున్నా.. తబ్లిగీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తించకుండా ఉండి ఉంటే లాక్‌డౌన్ మొదటి దశలోనే కరోనాను కట్టడి చేయగలిగే వాళ్లం.

వాళ్లు చేసింది ముమ్మాటికి నేరం.. వారికి కచ్చితంగా శిక్షపడాలి అని అన్నారు. యూపీ రాష్ట్రంలో దాదాపు 3 వేల మంది తబ్లిగీ జమాత్ సదస్సుతో సంబంధం ఉన్నవారు ఉన్నారు. రోగం తెచ్చుకోవడం నేరం కాదు.. దాన్ని దాచిపెట్టడం కచ్చితంగా నేరం. చట్టాన్ని అతిక్రమించడమే అవుతుంది. వారిపై చర్యలు తీసుకుంటాం అని యోగీ అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 2,328 మంది కరోనా వైరస్ బారిన పడగా, 654 మంది కోలుకున్నారు. 42 మంది మృత్యువాత పడ్డారు.

Tags

Next Story