కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి.. అమరులైన నలుగురు సైనికులు

ఉత్తర కాశ్మీర్‌లోని హంద్వారాలోని ఇంటి నుంచి ఉగ్రవాదులను బయటకు తరలించే ఆపరేషన్‌లో ఒక కల్నల్, ఒక మేజర్, ఇద్దరు సైనికులు పోలీసు అధికారితో పాటు మృతి చెందినట్లు వర్గాలు తెలిపాయి. హంద్వరాలోని చంజ్‌ముల్లా ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మృతి చెందారు.
ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు గంటల తరబడి కాల్పులు జరపడంతో కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్, లాన్స్ నాయక్, రైఫిల్‌మన్, పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ షకీల్ ఖాజీ మృతి చెందారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తుపాకీ యుద్ధం తీవ్రతరం కావడంతో రాత్రి అంతా, ఫేస్‌బుక్ , టెలిగ్రామ్‌లలోని అనేక పాకిస్తాన్ ఖాతాలు ఈ ఆపరేషన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com