బ్యాంక్ మేనేజర్‌కు కరోనా.. క్వారంటైన్‌లో కస్టమర్లు

బ్యాంక్ మేనేజర్‌కు కరోనా.. క్వారంటైన్‌లో కస్టమర్లు
X

లాక్డౌన్ ఉన్నా బ్యాంకులు యధావిదిగా పని చేస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. కస్టమర్లకు కూడా సామాజిక దూరాన్ని పాటించేలా బ్యాంకులు ఏర్పాటు చేశాయి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. చెన్నై రాణిపేట జిల్లా కావేరిపాక్కంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్ గత నెల 20 నుంచి మూడు రోజులు సెలవుపై వెళ్లారు.

ఆయన స్థానంలో విధులు నిర్వహించడానికి వాలాజా బ్యాంకులో పని చేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ మూడు రోజులు పని చేసి చెన్నైలో ఉన్న తన ఇంటికి వెళ్లారు. 30వ తారీఖు ఆయనకు జ్వరం వచ్చింది. కరోనా భయంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. దీంతో, వెంటనే స్పందించిన వాలాజా పేట ఆరోగ్య శాఖ అధికారులు బ్యాంకును మూసివేసి, ఆ రోజుల్లో పని చేసిన బ్యాంక్ సిబ్బందిని, బ్యాంక్‌కి వచ్చిన కస్టమర్లు ఎవరు అని ఎంక్వైరీ చేసి అందరినీ క్వారంటైన్‌కి తరలించి వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story