దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా..

దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇలా..
X

దేశంలో ఆదివారం కరోనావైరస్ కేసుల సంఖ్య 39,980 కు పెరిగింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నవీకరించిన తాజా గణాంకాల ప్రకారం, దేశంలో 28,046 క్రియాశీల కరోనావైరస్ కేసులు ఉన్నాయి, 10,632 మంది రోగులు వ్యాధి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు, మొత్తం 1,301 మంది ప్రాణాంతక అంటువ్యాధితో మరణించారు.

మరోవైపు మహారాష్ట్రలో కోవిడ్ -19 కేసులు 12,000 మార్కును దాటగా, గుజరాత్‌లో 5,000 కోవిడ్ -19 కేసులు ఉన్నాయి.

రాష్ట్రాలవారీగా కరోనావైరస్ కేసులు, మరణాలు సంఖ్య ఇలా ఉంది..

మహారాష్ట్ర

12,296 కోవిడ్ -19 క్రియాశీల కేసులతో, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 521 మంది మరణించగా, 2 వేల మంది రోగులు కోలుకున్నారు.

గుజరాత్

కోవిడ్ -19 కేసుల విషయంలో రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం రాష్ట్రంలో కేసుల సంఖ్య 5,054 గా ఉంది. కరోనావైరస్ వ్యాధి కారణంగా 262 మంది మరణించగా, గుజరాత్‌లో ఇప్పటివరకు 896 రికవరీలు జరిగాయి.

ఢిల్లీ

దేశ రాజధానిలో 4,122 మందికి కరోనా సోకింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం అరవై నాలుగు మంది సంక్రమణతో మరణించగా, 1,256 మంది కోలుకున్నారు.

మధ్యప్రదేశ్

మొత్తం 2,846 పాజిటివ్ కేసులను రాష్ట్రం నివేదించింది. ఇక్కడ కోవిడ్ -19 నుండి 151 మంది మరణించగా, 624 మంది కోలుకున్నారు.

రాజస్థాన్

రాజస్థాన్‌లో కరోనావైరస్ కేసులు ఆదివారం 2,770 కు చేరుకున్నాయి. రాష్ట్రంలో 65 మరణాలు సంభవించగా, 1,121 మంది రోగులు సంక్రమణ నుండి కోలుకున్నారు.

తమిళనాడు

దక్షిణాది రాష్ట్రంలో 2,757 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. తమిళనాడులో 1,341 రికవరీలు, 29 కోవిడ్ -19 మరణాలు సంభవించాయి.

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,487 కి చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లో 689 మంది కరోనావైరస్ నుంచి కోలుకోగా, 43 మంది ఇక్కడ సంక్రమణతో మరణించారు.

ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 1,525 పాజిటివ్ కోవిడ్ -19 రోగులు ఉండగా, ఇందులో 441 మంది కోలుకున్నారు. ముప్పై మూడు మంది మరణించారు.

తెలంగాణ

కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకు రాష్ట్రంలో 1,063 కి చేరుకుంది. నాలుగు వందల యాభై ఎనిమిది మంది వైరస్ నుండి కోలుకోగా, కోవిడ్ -19 నుండి 28 మంది మరణించారు.

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం నాటికి సోకిన కేసుల సంఖ్య 922 కు చేరుకుంది. రాష్ట్రంలో 33 మరణాలు, 151 రికవరీలు జరిగాయి.

జమ్మూ కాశ్మీర్

కోవిడ్ -19 రోగుల సంఖ్య 666 కు పెరిగింది. ఈ సంక్రమణతో ఎనిమిది మంది మరణించగా, 254 మందికి నయమైంది.

కర్ణాటక

రాష్ట్రంలో 601 కోవిడ్ -19 కేసులు, 25 మరణాలు నమోదయ్యాయి. రెండు వందల డెబ్బై మంది రోగులు నయమై డిశ్చార్జ్ అయ్యారు.

కేరళ

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కేరళలో ఆదివారం 499 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ -19 కారణంగా కేరళలో నాలుగు మరణాలు సంభవించగా, 400 మంది విజయవంతంగా కోలుకున్నారు.

హర్యానా మరియు పంజాబ్

ఈ రాష్ట్రాలలో మొత్తం 772 కోవిడ్ -19 కేసులు ఉన్నాయి.

బీహార్‌లో 481 మందికి కరోనావైరస్‌ సోకింది. నలుగురు మరణించగా, 107 మంది రోగులు కోలుకున్నారు.

ఒడిశాలో 157 కోవిడ్ -19 పాజిటివ్ రోగులు ఉన్నారు, 56 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. జార్ఖండ్‌లో 115 కోవిడ్ -19 కేసులు, ముగ్గురు రోగులు మరణించారు, 22 మంది కోలుకున్నారు.

ఉత్తరాఖండ్‌లో 59 మంది కరోనావైరస్ రోగులు ఉండగా, 39 మంది రోగులు ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 40 కేసులు ఉండగా , ఒక రోగి మరణించారు, 33 మంది కోలుకున్నారు. అస్సాంలో 43 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఒకరు మరణించగా, 32 మంది కోలుకున్నారు.

Tags

Next Story