అమ్మా.. మీకు మరికొంత సాయం.. జన్‌ధన్ ఖాతాల్లో రెండో విడత డబ్బులు

అమ్మా.. మీకు మరికొంత సాయం.. జన్‌ధన్ ఖాతాల్లో రెండో విడత డబ్బులు
X

మహిళల జన్‌ధన్ ఖాతాల్లో రెండో విడత డబ్బు జమ చేసేందుకు బ్యాంకులు సిద్దమయ్యాయి. ఎవరి బ్యాంకు అకౌంట్ నెంబర్ 0,1 తో ముగుస్తుందో వారు సోమవారం 4వ తేదీ నాడు ప్రభుత్వం జమ చేసిన రూ.500 పొందవచ్చు. అలాగే 2,3 నెంబర్లతో ముగిసే ఖాతాదారులు మే 5న.. 4,5 నెంబర్లతో ముగిసే ఖాతాదారులు మే 6న.. 6,7 నెంబర్లతో ముగిసే ఖాతాదారులు మే 8న.. 8,9 నెంబర్లతో ముగిసే ఖాతాదారులు మే 11న తమ ఖాతాల నుంచి డబ్బును పొందవచ్చు. మే 11 తరువాత లబ్దిదారులందరూ ఏ బ్యాంకు నుంచైనా తమ సౌకర్యాన్ని బట్టి డబ్బులు తీసుకోవచ్చు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా కేంద్రం మూడు నెలల పాటు రూ.500 చొప్పున జమ చేయనుంది. ఈ సొమ్ము మహిళల జన్‌ధన్ ఖాతాల్లో జమ కానుంది. మహిళల జన్‌ధన్ ఖాతాల మే నెల ఇన్‌స్టాల్‌మెంట్ సొమ్మును బ్యాంకులకు విడుదల చేసినట్లు బ్యాంకింగ్ సెక్రటరీ దేబాశిష్ పాండా శనివారం తెలిపారు.

Tags

Next Story