హర్యానాలో కొత్తగా 32 మందికి కరోనా..

హర్యానాలో, కరోనా సోకిన రోగుల సంఖ్య ఆదివారం నాటికి 400 దాటింది. కొత్తగా 32 మంది కరోనా భారిన పడ్డారు, దాంతో మొత్తం రోగుల సంఖ్య 425 కు పెరిగింది. ఆదివారం, ఒక్క సోనిపట్‌లో మాత్రమే 17 కొత్త కేసులు వచ్చాయి. వీరిలో సివిల్ హాస్పిటల్ వైద్యుడు కూడా ఉన్నారు. అలాగే సోనెపట్ ప్రాంతం వికాస్ నగర్లో నివాసం ఉండే ఒక తల్లి, కుమార్తె మరియు కొడుకు ముగ్గురికి కరోనా సోకినట్లు గుర్తించారు.

అంతకుముందు శనివారం రాష్ట్రంలో 31 కేసులు నమోదయ్యాయి. ఆదివారం సోనిపట్ కాకుండా, ఫరీదాబాద్లో 8, గుర్గావ్లో 4, జ్జర్ లో రెండు మరియు పానిపట్ లో 1 కేసు నమోదయింది. కాగా హర్యానాలో మొత్తం 242 మంది కోలుకోగా.. ఐదుగురు మరణించారు.. ప్రస్తుతం 179 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story