నగర వాసులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ..

నగర వాసులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ..
X

కేటీఆర్ సారు శాన మంచి వార్త సెప్పిన్రు. భాగ్యనగరంల ట్రాఫిక్ కష్టాలు లేకుంట చేస్తరట. రోడ్లన్నీ అద్దం లెక్క మెరిసి పోతయ్యట. కరోనా పుణ్యమా అని వచ్చిన లాక్‌డౌన్ మస్తు మంచిగ వాడుకుంటున్నరట. హైదరాబాద్ రోడ్ల నిర్మాణం పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఈ విషయాలు చెప్పారు. రోడ్ల నిర్మాణ పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

లాక్‌డౌన్‌ని ఓ మంచి పని కోసం వాడుతున్న రాష్ట్రం తెలంగాణనేనని చెప్పారు. హైదరాబాద్‌‌ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. లింక రోడ్లలో భూసేకరణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులకు, భూసేకరణకు నిధుల కొరత లేదని చెప్పారు. నిర్వాసితుల పట్ల మానవీయ కోణంలో వ్యవహరించాలని మంత్రి అధికారులకు సూచించారు.

Tags

Next Story