మీ సేవలకు ఓ చిరు కానుక.. గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై పూల వర్షం

ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటం చేస్తున్న గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బందికి ఆదివారం విశేష గౌరవం దక్కనుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కబళిస్తున్న వేళ వైద్యులు చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. వారి ప్రాణాలకు తెగించి.. కరోనా రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. అటు, హైదారాబాద్ లో గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అందుకు మినహాయింపు ఏమి కాదు. గత కొన్ని రోజులుగా వారి సెలవులను రద్దు చేసుకొని.. కుటుంబ సభ్యులతో గడపాల్సిన సమయం త్యాగం చేస్తున్నారు. ఈ ప్రమాదకర మహమ్మారితో సావాసం చేస్తూ.. రోగుల ప్రాణాలు రక్షిస్తూ.. చాలా మంది పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లేలా చేశారు. దీంతో వైద్యుల సేవలను గుర్తించిన ఎయిర్ ఫోర్స్.. వారికి అభినందనలు తెలియజేసేందుకు సిద్దమైంది. కరోనాతో ప్రత్యక్షముగా యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావంగా ఆదివారం ఉదయం 9.30 గంటలకు గాంధీ ఆస్పత్రిపై హెలికాఫ్టర్‌లతో పూల వర్షం కురిపించబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com