విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలి: జామియా యూనివర్సిటీ

విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలి: జామియా యూనివర్సిటీ
X

న్యూఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో ఉంటున్న విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయాలని వర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. హాస్టల్‌‌ గదులను ఖాళీచేసి ఇళ్లకు చేరుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న రవాణా సౌకర్యాలు ద్వారా ప్రయాణం సాగించాలని తెలిపింది. కరోనా ప్రభావంతో యూనివర్శిటీని మూసేశామని.. రెగ్యులర్ స్టూడెంట్ల కోసం మళ్లీ ఆగస్టులో తెరుస్తామని తెలిపింది. అటు, కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. అయితే, కరోనా ప్రభావంతో యూనివర్సిటీని మూసివేసినా.. ఇళ్లకు వెళ్లలేని వారు ఇప్పటి వరకు హాస్టల్ లోనే ఉన్నారని.. కానీ, ఇప్పుడు ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఇళ్లకు వెళ్లాలని సూచించింది. ఇప్పుడు వర్శిటీ మెయింటెనెన్స్‌ కష్టమవుతోందని.. హాస్టళ్లను పూర్తిగా ఖాళీ చేయించడం తప్ప మరో గత్యంతరం లేదని కూడా ఆ ప్రకటనలో జామియా వర్శిటీ పేర్కొంది.

Tags

Next Story