సామాజిక దూరం కోసం బైక్‌ను తయారు చేశాడు..

సామాజిక దూరం కోసం బైక్‌ను తయారు చేశాడు..
X

కరోనా మహమ్మారి లింక్ తెంచాలి అంటే సామాజిక దూరం పాటించాలి అన్నది అందరికి తెలిసిన విషయం.. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు సామజిక దూరాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. అయితే వాహనాల్లో ఇది కుదరదు.. అందుకే ఓ వ్యక్తి ఆ దిశగా అలోచించి.. సామాజిక దూరం పాటించేలా ఓ ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేశాడు.. అతని పేరు పార్థ సాహా.. ఊరు త్రిపుర రాజధాని అగర్తాల..

కరోనా దృష్ట్యా ప్రయాణాలు చేసేటప్పుడు సామాజిక దూరం పాటించాలన్న లక్ష్యంతో ఈప్రత్యేకమైన ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేశారు.. దీనిమీద ఇద్దరు కూర్చువచ్చు. 2 సీట్లకు మధ్య సుమారు మీటరున్నరు దూరం ఉంటుంది. దీనికి 'కోవిడ్ -19 బైక్' అని పేరు కూడా పెట్టారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత పాఠశాలలు తెరవగానే ఈ బైక్ ద్వారానే తన కుమార్తెను పాఠశాలకు తీసుకువెళతానని చెప్పారు. కరోనా రాకుండా ఉండాలనే ఉంద్ద్యేశంతో తాను ఈ బైక్ ను తయారు చేసానని అన్నారు.

Tags

Next Story