గుజరాత్ లో పోలీసు వాహనాలపై రాళ్లు రువ్విన వలస కార్మికులు

X
గుజరాత్ లో కొంత మంది వలస కార్మికులు పోలీసు వాహనంపై రాళ్లు రువ్వారు. కేంద్రం వలస కార్మికులను తమతమ రాష్ట్రాలకు తరలించేందుకు అనుమతించడంతో దాహోద్ జిల్లాలో కొంగేలా ప్రాంతంలో చిక్కుకున్న కొంతమంది ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. అయితే.. వారిని స్థానిక పోలీసులు అదుపుచేయడానికి ప్రయత్నించగా.. కొంతమంది పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. దాహోద్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. "కొంత మంది సంఘవిద్రోహ శక్తులు మాపై రాళ్ళూ రువ్వారు. మా వాహనాల ధ్వంసం అయ్యాయి. కాని ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి 40 మందికి పైగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
