ఉత్తరభారతదేశం లోని ఈ రాష్ట్రాల్లో నేటినుంచి వర్షాలు

ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మే 3 నుండి 6 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. పశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన ఆవర్తనం కారణంగా ఉత్తర భారత మైదానాలు అలాగే కొండలలో ఆదివారం నుండి తేలికపాటి నుండి మితమైన వర్షాలు పడటం ప్రారంభిస్తాయని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు.
దీని ప్రభావంతో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర రాజస్థాన్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి అని శ్రీవాస్తవ చెప్పారు. అలాగే కొన్ని చోట్ల వడగళ్ళు కూడా వస్తాయని ఆయన అన్నారు. మరోవైపు నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రత కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com