కిమ్ ను చూడటం చాలా సంతోషంగా ఉంది: ట్రంప్

కిమ్ ను చూడటం చాలా సంతోషంగా ఉంది: ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ను తిరిగి చూడటం చాలా సంతోషంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కిమ్ ఆరోగ్యం క్షీణించిందని.. అతను చనిపోయాయాడని వార్తలు వచ్చిన తరువాత ఆయన బహిరంగంగా కనిపించడంతో ట్రంప్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

నార్త్ కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాత పుట్టినరోజు వేడుకల్లో ఎప్రిల్ 15న కిమ్ కనిపించకపోవడంతో.. తన ఆరోగ్యంపై పుకార్లు చెలరేగాయి. అయితే, దాదాపు మూడువారాల తరువాత శుక్రవారం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభోత్సవంలో కిమ్ మల్లి దర్శనమిచ్చారు. దీంతో ఇప్పటివరకు ఆయన ఆరోగ్యం పట్ల వచ్చిన వార్తలకు చెక్ పడింది. దీనిపై ట్రంప్ తాజాగా ట్వీట్ చేసి.. కిమ్ ను మళ్లీ చూడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story